లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్(AR Rahman)కు అస్వస్థత అనగానే ఒక్కసారిగా సినీలోకం అంతా ఉలిక్కిపడింది. రెండ్రోజుల క్రితం ఆయన ఛాతిలో నొప్పితో ఆసుపత్రి(Hospital)లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన హెల్త్‌పై అప్డేట్(Health update) వచ్చింది. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారని ఆయన సోదరి రిహానా(AR Reihana) తాజాగా వెల్లడించారు. ఆయన గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరలేదని, పని ఒత్తిడి కారణంగా డీహైడ్రేషన్‌తో పాటు గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల కాస్త అస్వస్థతకు గురయ్యారని, ఈ మేరకు చికిత్స తీసుకున్నారని ఆమె క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని సినిమాలకు మ్యూజిక్ అందించాలి..
కాగా, రెహమాన్ అస్వస్థతకు గురైనట్లు ఆదివారం ఉదయం వార్తలు వచ్చాయి. చెన్నై(Chennai)లో ఉన్న ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెహమాన్‌కు వైద్యులు ECG, ఈకో కార్డియో గ్రామ్ పరీక్షలు చేసి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలియడంతో రెహమాన్ అభిమానులు(Fans) సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పూర్తి స్థాయిలో హెల్దీగా ఉండి మరిన్ని సినిమాలకు మ్యూజిక్ అందించాలని ఆకాంక్షిస్తున్నారు.






