BigBoss7: ఈవారం కెప్టన్​ అర్జున్!

బిగ్​ బాస్​7 సీజన్​లో మూడవ కెప్టన్​గా అర్జున్​ గెలిచాడు. మొదటి కెప్టన్​గా పల్లవి ప్రశాంత్​ విజయం సాధించాడు. తర్వాత వారంలో రెండవ కెప్టన్​గా యావర్​ అవకాశం అందుకున్నాడు. మూడవవారంలో జరిగిన కెప్టన్​ టాస్క్​లో అశ్విని, ప్రియాంక, ప్రశాంత్ ముగ్గురు కెప్టెన్సీ రేస్ నుంచి తొలగిపోయారు.

నేను ఇక్కడికి సోలోగానే వచ్చాను
ప్రియాంక.. నువ్వు అమర్ కు ఇంట్లో ఎవరితోనైన గొడవైన ప్రతిసారి మధ్యలో వస్తావు అది నాకు నచ్చలేదు అంటూ యావర్ ప్రియాంకను కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించాడు. దాంతో ప్రియాంక నేను అమర్ కోసం రాలేదు ఒక హౌస్ మేట్ గా నా ఒపీనియన్ చెప్పాను. నేను ఇక్కడికి సోలోగానే వచ్చాను, సోలోగానే ఆడతాను సోలోగానే వెళ్ళిపోతాను. నేను ఇక్కడికి ఎవరి కోసం రాలేదు అంటూ యావర్ పై కోపంగా వెళ్ళిపోయింది. వీళ్లిద్దరి మధ్య ఆర్గుమెంట్ గట్టిగానే జరిగింది.
వీళ్ళిద్దరితో పాటు పూజ ప్రశాంత్ ను కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించింది. అందరికి ఒక చాన్స్ రావాలి ప్రశాంత్ అని చెప్పి ప్రశాంత్ ఫోటోను పూల్ లో వేసింది దానికి ప్రశాంత్ ఒకసారి కెప్టెన్ అయితే మళ్ళీ అవ్వకూడదా అని పూజతో ఆర్గుమెంట్ చేసినట్లు కనిపించింది.

చివరికి కళ్లకు గంతలు పెట్టుకుని సందీప్​, అర్జున్​ మధ్య టాస్క్​ జరిగింది.దీంట్లో కళ్లకు గంతలు పెట్టుకుని కెప్టన్​ అనే ఇంగ్లీష్​ అక్షరాలను పేర్చాల్సి ఉంది. దీనికి తేజ సంచాలకులుగా వ్యవహరించారు. ముందుగా పెట్టిన అర్జున్​ను కెప్టన్​ ప్రకటించారు.

Share post:

లేటెస్ట్