మన ఈనాడు:
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన నాటి నుంచి సీఎం కేసీఆర్కు వర్గ విభేదాలతో పెద్ద తలనొప్పి మొదలైంది. పేరు మార్పుతో కలిసొచ్చినట్లు కనిపిస్తడం లేదని ఆ మధ్య పార్టీ నేతలే గుసగుసలాడారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీకి టీఆర్ఎస్ రూపంలో మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాల్లోకి వెళ్లారు. తుపాకుల బాలరంగం అధ్యక్షుడిగా తెలంగాణ రాజ్య సమితి పార్టీ (TRS)ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయ్యింది. ఈ పార్టీకి ఎన్నికల గుర్తుగా గ్యాస్ సిలిండర్ ను ఈసీ కేటాయించింది. దీంతో రాష్ట్రంలోని 119 స్థానాల్లో ఈ పార్టీ తరఫున అభ్యర్థులు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.?