మన ఈనాడు:
PK ఇప్పుడు APలోనే కాదు తెలంగాణలో కూడా తమ పార్టీ సత్తా ఎంటో చూపించేందుకు సిద్దం అవుతున్నారు. హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో పవన్.. జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాల్సిందేనని జనసేన తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్‌కు విన్నవించారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ఏపీలో దశల వారిగా వారాహి యాత్ర చేస్తూ.. వైసీపీ సర్కార్‌పై తీవ్రంగా విమర్శల చేస్తున్నారు. ఇప్పుడు ఐదో విడత వారాహీ యాత్రకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ అటూ ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా తమ పార్టీ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాల్సిందేనని జనసేన తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్‌కు విన్నవించుకున్నారు.అలాగే మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా పోటీ నుంచి విరమించుకున్నామని.. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం తప్పనిసరిగా పోటీచేయాల్సిందేనని చెప్పారు.
ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబబ్ తింటుదని తెలంగాణ జనసేన నాయకులు చెప్పిన విషయాల్ని పవన్.. కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లకు వివరించారు.
అయితే ఉమ్మడిగా పోటీ చేసే విషయంపై పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పవన్ వారితో చెప్పారు. అయితే జనసేన పార్టీ తెలంగాణలో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుంటుందా అనే విషయం మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ, టీపీడీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటీవలే తాము టీడీపీతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. ఏకపక్షంగా టీడీపీతో కలిసినడుస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.