మన ఈనాడుః
తండ్రి లేకుండా తొలిసారిగా ఎన్నికల్లో బరిలోకి దిగిన జి.సాయన్న కుమార్తె లాస్య నందిత(Lasya Nandita)కు సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) కొండంత ధైర్యాన్ని నింపారు. ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరంలేదని భరోసా కల్పించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ప్రజలు దీవెనలతో తప్పకుండా విజయం సాధిస్తావంటూ ధైర్యం చెప్పారు. ప్రగతి భవన్‌లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య నందితకు బీ-ఫారం అందజేశారు. బీఆర్ ఎస్ సంక్షేమ పథకాలు నియోజకవర్గ ప్రజలకు సాయన్న చేసిన సేవ జనం గుర్తుంచుకోని మరి నిన్న చట్టసభల్లోకి వెళ్లేలా చేస్తారని ఆమెకు ధైర్యం చెప్పారు.
కటింగ్‌లు, కటాఫ్‌లు తప్ప.. రేవంత్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేంటి?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఏడాది పాలనపై ఎక్స్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను రేవంత్ సర్కార్ నట్టేట ముంచిందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు కోతలు, కటాఫ్‌లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వదిలేశారని…