మన ఈనాడు:
గ్రేటర్ హైదరాబాద్‌లో ఉప్పల్ నియోజకవర్గం ఈసారి హట్ టాఫిక్ గా మారింది. అధికారపార్టీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని మరో బలమైన నాయకుడు బండారి లక్ష్మారెడ్డికి అభ్యర్థిగా ఖారారు చేసి భీపామ్ సైతం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ మందుముల పరమేశ్వరెడ్డికే టిక్కెట్ ఖారారు చేసింంది.
ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, భారస అభ్యర్థులను ప్రకటించింది. భాజపా నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేరు దాదాపు ఖాయం అయింది. కానీ తెరమీదకి మరో కొంతమంది బీసీ నేతలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. హస్తం పార్టీ అభ్యర్థి మందముల పరమేశ్వరరెడ్డి స్థానిక నాయకలు మనస్సు గెలుచుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే రాజకీయపార్టీలకు అతీతంగా కాలనీసంఘాలు మందములకే అవకాశం ఇస్తామంటూ మద్దతు సైతం పలుకుతున్నారు.
స్థానికుడిగా ఉన్న గతంలో కార్పొరేటర్ సేవలు అందించా..ఇప్పుడు నా సతీమణి రజిత కార్పొరేటర్ కొనసాగుతుంది. హస్తం గుర్తుపై ఓటు వేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకొందామని మందముల పరమేశ్వరరెడ్డి జనాన్ని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థికి వస్తున్న ఆదరణతో భారస, భాజపాలు కంగుతింటున్నాయి.
ఉప్పల్ రాజకీయాలకు ప్రత్యేకస్థానం ఉంది. నియోజకవర్గం ఏర్పడిన తొలిసారి కాంగ్రెస్ విజయం సాధించింది. తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో భాజపాను గెలిపించారు. తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థికి పట్టం కట్టారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఇవ్వబోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం కంటే చేరికలపై దృష్టి సారించింది. గ్రూపు రాజకీయాలతో భారస అభ్యర్థి జనంలోకి వెళ్లే పరిస్థితిపై ఆపార్టీ నేతలు సందిగ్దం వ్యక్తం చేస్తున్నారు. ఆరు గ్యారంటీలతో జనంలోకి విసృంతగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రజల్లోకి పోతున్నారు. భారస అభ్యర్థి మాత్రం తన ట్రస్టు ద్వారా జనానికి చేసిన సేవలను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళ్లడం సొంతపార్టీ నేతలకు మింగుడు పడటం లేదు.