పోచారానికి పోటీ లేదు..బాన్సువాడలో కారుకు తిరుగులేదు!

మన ఈనాడు:

ప్రజలతో ప్రత్యక్షంగా 40ఏళ్లుకు పైబడి రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్న ఏకైక నాయకుడు..ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేస్తే..ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనకే సొంతం..భాన్సువాడ (BANSWADA) నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పోచారం శ్రీనివాస్​రెడ్డికి (POCHARAM SRINIVAS REDDY) ప్రజల్లో తనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడ పోచారానికి పోటీనే లేదు..కారు స్పీడ్​కు ఎదురొచ్చి నిలబడే సత్తా, ధైర్యం మరోపార్టీ చేయదు.

1994లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్​రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయంలోనే 1998లో గృహనిర్మాణశాఖ మంత్రిగా పదవి చేపట్టారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి మంత్రి గనులశాఖ, పంచాయితీరాజ్​ మంత్రి పదవులు చేపట్టారు. 2004లో కాంగ్రెస్​ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్​రెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచారు. 2011 టిడిపికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. టిఆర్​ఎస్​లో చేరాక జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి నుంచి నేటి వరకు ఆయనకు భాన్సువాడలో తిరుగులేదు.

తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వంలో తొలి వ్యవసాయశాఖ మంత్రిగా పోచారం రికార్డు సాధించారు. 2019లో మరోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్​ఎస్​ ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్​గా కొనసాగుతున్నారు. భాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి పల్లెలో పోచారం మార్కు కనిపిస్తుంది. 9మండలాలతో కూడిన భాన్సువాడ నియోజకవర్గం ఏ పల్లెకు వెళ్లినా పోచారం వేసిన బాట..పోచారం చేసిన మార్కు ఉండాల్సిందే.

భాన్సువాడ, బిర్కూరు, నర్సులాబాద్​, వర్ని, కొటగిరి, రుద్రూరు, చందూరు, మోస్రా, పొతంగల్​ మండలాల్లో ఎటు చూసినా పోచారం అందించిన సాయం ఆయన చేసిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా దేవాలయాల అభివృద్ధిలో ఆయన చేసిన పాత్ర మరవలేనిది. సీఎం కేసీఆర్​ లక్కి నెంబరు 6 అయితే..భాన్సువాడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్​రెడ్డి ఆరోవసారి విజయం సాధించి రికార్డు సృష్టించబోతున్నారు. తెలంగాణ 2023అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ గెలిచే మొదటిస్థానం భాన్సువాడ నియోజకవర్గమే.

 

Share post:

లేటెస్ట్