మన ఈనాడు: తన ప్రస్థానం ఊహించని మలుపు..మధ్యతరగతి కుటుంబం నుంచి జనం నేత మారిన తీరు..గులాబీ ఇచ్చిన తొలి అవకాశంతో MPTC నుంచి MLA వరకు ఎదిగిన తీరు..ప్రజల మనస్సు గెలిచిన ఆ నేత గొంగుడి సునితారెడ్డిపై ‘మన ఈనాడు’ డిజిటల్ వేదికగా అందిస్తున్న ప్రత్యేక కథనం
సికింద్రాబాద్ వెస్లీ గర్స్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆతర్వాత ఉస్మానియా బీకాం పూర్తి చేసి..ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం ప్రారంభించింది. మహేందర్‌రెడ్డితో వివాహం జరిగాక సాదారణ మహిళేగానే ఇల్లాలి పాత్రనే పొషించింది.
కేసీఆర్ తెలంగాణ గళం ఎత్తుకున్నాక 2001లో తొలిసారి ఎంపీటీసీగా అవకాశం వచ్చింది. ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ పదవి చేపట్టింది. 2006–2011వరకు వంగపల్లి సర్పంచ్‌గా పోటీచేసి గెలిచి సత్తా చూపించారు. అప్పటి తెరాస పార్టీ మహిళా విభాగం రాష్ర్టస్థాయిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
నర్శింహుడి దీవెనలతో చట్టసభల్లోకి
2014 తెలంగాణ రాష్ర్టం ఆవిర్భావించాక జరిగిన ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నుంచి గొంగిడి సునితారెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాన్ని కేసీఆర్ కల్పించారు. కాంగ్రెస్ అభ్యర్థి బూడిద బిక్షమయ్యగౌడ్ పై 31471ఓట్ల మెజార్టీ సాధించారు. 2018లో మరోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అదే అభ్యర్థిపై 33086ఓట్ల మెజార్టీతో కారు స్పీడ్ సత్తా ఎంటో చూపించారు.
హ్యాట్రిక్..క్యాబినెట్ పక్కా
రెండుసార్లు ఘన విజయం సాధించి ఆలేరు నియోజకర్గ జనం మనస్సు గెలిచారు. సీఎం కేసీఆర్ సైతం తిరుగులేని మహిళా నేత మెచ్చారు. ఆమె పట్టుబట్టి యాదాద్రి దేవాలయాన్ని కేసీఆర్ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడంలో తిరుగులేని విజయం సాధించారు. దీంతోపాటు ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట,తుర్కపల్లి,గుండాల, ఆత్మకూరు(ఎం),బొమ్మల రామారం,మోటుకొండూరు మండలాల్లో తానే ప్రత్యేకంగా చొరవ తీసుకోని అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిపారు. ఈ సారి ఎన్నికల వార్ వన్‌సైడ్ ఉంటుందని సునితను గెలిపించి క్యాబినెట్ మంత్రిగా చూడబోతున్నామని నియోజకవర్గ ప్రజలు ముచ్చట పడుతున్నారు.