మన ఈనాడు: మహేశ్వరం నియోజకవర్గం మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయం రసవరత్తరంగా మారనుంది. అధికారపార్టీ బీఆర్ఎస్ నుంచి మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి బరిలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆతర్వాత అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ గూటికి చేరి క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రి పదవి దక్కించుకున్నారు.
హస్తం ఓటు బ్యాంక్‌పైనే గురి:
కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు పేర్లు ప్రధానంగా వినిపిస్తుంది. కానీ బడంగ్పేట్ మున్సిపల్ ఛైర్పర్సన్ చిగురిచింత పారిజాతతోపాటు, దేప భాస్కర్‌రెడ్డి పేర్లే ప్రధానంగా లీస్టులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ హస్తం పార్టీ ఓట్లు పదిలంగా ఉన్నాయని పార్టీ నాయకులు బలంగా ఉన్నారు.
దేపపైనే స్క్రీనింగ్ కమిటీ మొగ్గు:
55మంది తొలి జాబితా విడుదలైన నేపథ్యంలో మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై అందరికి ఆసక్తి నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని మహేశ్వరం నియోజకవర్గంపై తెలంగాణ కాంగ్రెస్‌తోపాటు, భారతీయ జనతాపార్టీ ఫోకస్ సారించాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో డిల్లీలో జరిగిని స్క్రీనింగ్ కమిటీలో దేవ భాస్కర్‌రెడ్డి వైపూ అధిష్టానంతోపాటు సర్వే రిపోర్టు సైతం సానుకూలంగా వచ్చినట్లు తెలుస్తుంది. సీటీతోపాటు, గ్రామీణ వాతావరణంతో కూడిన ప్రజలతో కలిసిన నియోజకవర్గం మహేశ్వరం. కాంగ్రెస్ పార్టీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు సెంటిమెంట్‌గా మహేశ్వరం నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు. ఈక్రమంలో ప్రజల్లో బలమైన నేతతోపాటు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ముద్ర వేసుకున్న దేప భాస్కర్‌రెడ్డి టిక్కెట్ ఖారారు అయ్యినట్లు సమాచారం.