TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. ఆ భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు పునరుద్ధరణ..!

TTD: రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లపై టీటీడీ ఈఓ సమీక్ష నిర్వహించింది. ప్రత్యేక దర్శనం టికెట్లను వివిధ గవర్నమెంట్ శాఖల అధికారులకు ఇవ్వాలా వద్దా అన్నదానపై చర్చ నడుస్తోంది.ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఇవ్వాల్సి వస్తే ఏ ప్రాతిపదికన కల్పించాల్సి ఉంటుంది ? అనే అంశాలపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. రెండు రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

అలాగే, టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాలినడక భక్తులకు దివ్య దర్శనం టోకెన్లను పునరుద్ధరణ చేసింది. టోకెన్ తీసుకున్న భక్తులు 1200 మెట్టు వద్ద కౌంటర్ లో టోకెన్ స్కాన్ చేసుకోవాలని నిబంధన విధించింది. లేకుంటే దర్శనాలకు అనుమతించమని టీటీడీ ప్రకటించింది.

గతంలో శ్రీవారి మెట్టు వద్ద టోకెన్లు తీసుకుని వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. భక్తుల అవసరాన్ని దళారులు, ట్యాక్సీ డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారని గుర్తించిన టీటీడీ ఈఓ.. పాత పద్ధతినే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. శ్రీవారి మెట్టు మార్గంలో ప్రస్తుతం రోజుకు 2500 టోకెన్లతో ట్రైల్ రన్ అవుతోంది. త్వరలో 6వేల టోకెన్లకు పెంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది. తాజా నిర్ణయంతో దళారులకు టీటీడీ చెక్ పెట్టింది.

 

Share post:

లేటెస్ట్