Mana Enadu: అనంతసాగర్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను రైతు సమన్వయ సమితి సభ్యుడు నూతలపాటి వెంకటేశ్వరరావు కోరారు. చింతకాని మండల పర్యటనలో గురువారం సుడా మాజీ డైరక్టర్ చల్లా అచ్చయ్యతో కలిసి భట్టి విక్రమార్కను కలిశారు.
నియోజకవర్గ అభివృద్ధితోపాటు చింతకాని మండల గ్రామాల అభివృద్ధి కోసం తాను ప్రత్యేకంగా దృష్టి పెట్టానని డిప్యూటీ సీఎం తెలిపారు. పట్టణాలకు ధీటుగా చింతకాని మండలాన్ని తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.