బీఆర్​ఎస్​ అభ్యర్థులకు సీఎం కేసీఆర్​ ట్విస్ట్​

మన ఈనాడు:  తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ భారస అభ్యర్థులకు బీఫామ్ లను అందజేస్తున్నారు. మొత్తం 119 స్థానాలకు గానూ.. ఈ రోజు కేవలం 51 మందికి మాత్రమే బీఫామ్ లను అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. నిన్న అమవాస్య కావడంతో బీఫామ్ లను సిద్ధం చేయలేకపోయినట్లు చెప్పారు. ఒకటి, లేదా రెండు రోజుల్లో మిగతా వారికి కూడా బీఫామ్ లు అందించనున్నట్లు తెలిపారు.ఈ రోజు కేవలం 51 మంది అభ్యర్థులకు మాత్రమే బీఫామ్ లను అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మిగతా అభ్యర్థులకు రెండు రోజుల్లో అందిస్తామన్నారు. ఈ నేపథ్యంలో బీఫామ్ చేతికి రాని అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ రోజు కేవలం 51 మంది అభ్యర్థులకు మాత్రమే బీఫామ్ లను అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మిగతా అభ్యర్థులకు రెండు రోజుల్లో అందిస్తామన్నారు. ఈ నేపథ్యంలో బీఫామ్ చేతికి రాని అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ రోజు బీఫామ్ అందుకోవడం కోసం ఎంతో ఆశగా తెలంగాణ భవన్ కు వచ్చిన మిగతా అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముందుగా ప్రకటించిన 115 స్థానాల్లో కనీసం ఐదు నుంచి పది మంది వరకు అభ్యర్థులను మార్చే ప్రచారం ఇప్పటికే సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు బీఫామ్ అందుకోని వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. తమకు ఏమైనా టికెట్ రద్దు చేస్తారా? అన్న టెన్షన్ ఆయా అభ్యర్థుల్లో కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. 51 మంది అభ్యర్థుల బీఫామ్ లను సీఎం కేసీఆర్ అందించారు. బీ ఫామ్ లతో పాటు ఎన్నికల ఖర్చు కోసం రూ.40 లక్షల చెక్ ను సైతం కేసీఆర్ ఆయా అభ్యర్థులకు అందించారు. అయితే.. కామారెడ్డిలో పోటీ చేయనున్న సీఎం కేసీఆర్ కు సంబంధించిన బీఫామ్ ను ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్దన్ అందుకున్నారు.

ప్రస్తుతం బీఫామ్ ల పంపిణీ పూర్తి కావడంతో మేనిఫెస్టో ను ప్రకటించనున్నారు కేసీఆర్. ప్రెస్ మీట్ లో కేసీఆర్ స్వయంగా మేనిఫెస్టోను ప్రకటించనున్నారు.

Related Posts

Khammam|కార‌ణం తెలియ‌దు కానీ..ఖ‌మ్మం ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం

ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి త‌న‌కి ఇంకా కార‌ణం తెలియ‌దు కానీ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, పోలీస్ క‌మిష‌న‌ర్‌తో క‌లిసి గురువారం ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో ప్ర‌మాదం జ‌రిగిన తీరును…

BIG BREAKING: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుల దాడి

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌(Saif Ali Khan)పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ముంబై(Mumbai)లోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగులు ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆయనపై కత్తితో అటాక్(Knife Attack) చేశారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *