
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా (Kalyan Ram), లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijaya Shanthi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘అర్జున్ S/o వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi). బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్(Saiee Manjrekar) హీరోయిన్‌గా కనిపించిన ఈ మూవీలో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ (Sohail Khan) మరో కీలక పాత్రలో కనిపించారు. న్యూ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి రూపొందించిన ఈ సినిమా గత నెల 18న థియేటర్లోకి వచ్చిన విషయం తెలిసిందే. తల్లీ కొడుకుల సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చేసింది..
తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ సడన్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీని సైలెంట్‌గా OTTలోకి విడుదల చేశారు మేకర్స్. అయితే, ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కేవలం యూకేలో ఉన్నవాళ్లకి మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇవాళ్టి నుంచి ఇండియాలో కూడా సినిమా మనవాళ్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా (Amazon Prime Video) తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
Kalyan Ram’s 21st Film #NKR21 #ArjunSonOfVyjayanthi now streaming on @PrimeVideoIN.
Don’t miss this emotional tale of mother and son.@NANDAMURIKALYAN @vijayashanthi_m @saieemmanjrekar @SohailKhan @Dirpradeepch @SunilBalusu1981 @muppaav @AJANEESHB @AshokaCOfficial pic.twitter.com/o7lYVIYTpE
— SKR (@SKRforNTR) May 16, 2025
కాగా ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాను నిర్మించారు. అర్జున్ రాంపాల్, పృథ్వీ రాజ్, చరణ్ రాజ్, భరత్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.