Ashok Galla : ‘దేవకీ నందన వాసుదేవ’ ట్రైలర్‌ రిలీజ్‌

Mana Enadu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) కథానాయకుడిగా ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva Release Date) అనే సినిమా వస్తోంది. ఈనెల 22వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో మానస వారణాసి హీరోయిన్ గా నటించింది. యంగ్ డైరెకెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించగా.. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

ప్రతి కథపై హీరో పేరు ఉంటుంది

ఈ హైదరాబాద్ లో ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. టాలీవుడ్‌ నటుడు రానా (Rana), హీరో సందీప్‌కిషన్‌, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prashant Varma), రచయిత సాయిమాధవ్‌ బుర్రా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ప్రతి కథ పైన హీరో పేరు రాసి ఉంటుందని తాను నమ్ముతానని అన్నారు. ఈ కథను తాను 7 ఏళ్ల క్రితం రాసుకున్నానని.. ఈ సినిమాను అశోక్‌ గల్లా చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నానని హర్షం వ్యక్తం చేశారు.

ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్

ఇక ఈ సినిమా ట్రైలర్ సంగతికి వస్తే.. ‘ఈ భూమి మీద ఎక్క‌డా లేని విధంగా సుద‌ర్శ‌న చ‌క్రంతో వాసుదేవుడి విగ్ర‌హం ఉంది’ అనే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ‘ఈ ఒక్క సంవత్సరం జాగ్రత్తగా ఉండు నాన్న.. జాతకంలో ఏదో ఇబ్బంది ఉందట’, ‘నీ మరణగండం నీ ఇంటనే పుడుతుంది’, ‘చావు దగ్గరికి వెళ్లకు, అది నీ దగ్గరికి వచ్చేదాక వెయిట్ చెయ్’ అనే డైలాగ్స్ ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. కృష్ణుడి స్టోరీ పాయింట్ తో ఈ సినిమా వస్తున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *