దేవకి నందన వాసుదేవ మూవీ తర్వాత అశోక్ గల్లా (Ashok Galla) హీరోగా నటిస్తున్న చిత్రం విసా (వింటారా సరదాగా) (Vintara Saradaga). తెలుగు బ్యూటీ శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) హీరోయిన్. ఉద్భవ్ డైరెక్టర్‌గా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్నారు. తాజాగా మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. అమెరికా నేపథ్యంలో సాగే సినిమా ఇది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల జీవితాల్ని, వారి కలల్ని, ప్రేమ-స్నేహాల్ని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ‘ప్రేమ అంటే తప్పించుకోలేని ప్రాబ్లమ్. నా ప్రేమ కథన వింటారా సరదాగా’.. అంటూ హీరో సంభాషనలతో టీజర్ సాగింది. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆసక్తికరంగా ఉన్న టీజర్‌ను మీరూ చూసేయండి.






