
క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు మరో మెగా టోర్నీ రాబోతుంది. ఆసియా కప్ (Acia Cup-2025) ఈ ఏడాది 17వ ఎడిషన్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరగనుంది. T20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీ 2026 T20 వరల్డ్ కప్‌కు సన్నాహకంగా కానుంది. ఈ టోర్నీలో ఆసియా నుంచి ఎనిమిది జట్లు పాల్గొంటాయి. అందులో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్, UAE, ఒమన్ జట్లు పాల్గొంటాయి. భారత్(India) డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంద. 2023లో శ్రీలంకను ఓడించిన భారత్ టైటిల్ గెలిచింది.
రెండు గ్రూప్‌లు.. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు
కాగా టోర్నమెంట్ రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయి. గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, UAE, ఒమన్ ఉండగా, గ్రూప్ Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్ ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్ రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు చేరుకుంటాయి. సూపర్ ఫోర్లో రౌండ్-రాబిన్ ఫార్మాట్లో ఆడిన తర్వాత, టాప్ రెండు జట్లు సెప్టెంబర్ 28న ఫైనల్లో తలపడతాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో అత్యంత ఆసక్తికరమైన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్(India vs Pakistan Match) సెప్టెంబర్ 7న గ్రూప్ దశలో జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌ను భారత్ హోస్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ, భారత్-పాకిస్థాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా UAEలో నిర్వహిస్తున్నారు. టికెట్లు ఆన్లైన్లో Paytm, BookMyShow వంటి ప్లాట్‌ఫారమ్‌లతోపాటు ఆఫ్‌లైన్ రిటైల్ ఔట్‌లెట్లలోనూ అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది.
భారత్ షెడ్యూల్ ఇలా..
☛ సెప్టెంబర్ 10: ఇండియా vs యూఏఈ
☛ సెప్టెంబర్ 14: ఇండియా vs పాకిస్థాన్
☛ సెప్టెంబర్ 19: ఇండియా vs ఒమన్
సూపర్ ఫోర్ మ్యాచులు ఇలా..
☛ సెప్టెంబర్ 20: B1 vs B2
☛ సెప్టెంబర్ 21: A1 vs A2 (అంచనా: ఇండియా vs పాకిస్థాన్)
☛ సెప్టెంబర్ 23: A2 svs B1
☛ సెప్టెంబర్ 24: A1 vs B2
☛ సెప్టెంబర్ 25: A2 vs B2
☛ సెప్టెంబర్ 26: A1 vs B1
☛ సెప్టెంబర్ 28: ఫైనల్
🚨 Asia Cup 2025 officially confirmed. 🚨
– Tournament to be held from 9th to 28th September.
– India and Pakistan will be in same group.
– 8 teams event.
– T20I format.
– IND, PAK, Bangladesh, Sri Lanka, Afghanistan, UAE, Oman, & Hong Kong are participants.#AsiaCup2025 pic.twitter.com/14TWuyY4Lp
— Ahmad Haseeb (@iamAhmadhaseeb) July 26, 2025