ఆసియా(Asia)లోనే అత్యంత వృద్ధ ఏనుగు(Elephant) ‘దాదీ మా’గా ప్రసిద్ధి చెందిన ‘వత్సల’ (Vatsala) తుదిశ్వాస విడిచింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్(Panna Tiger Reserve)లో ఇది మృతి చెందింది. ఏనుగు ముందు కాళ్ల గోళ్లకు గాయాలు కావడంతో అభయారణ్యంలోని ఖైరైయాన్ కాలువ(Khairaian Canal) సమీపంలో కూర్చొని ఉండిపోయింది. వైద్యులు, సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ పైకి లేవలేకపోయింది. అనంతరం మృతిచెందినట్లు పన్నా టైగర్ రిజర్వ్ ప్రకటన విడుదల చేసింది. 100 ఏళ్లకు పైగా బతికిన ఈ ఆడ ఏనుగును “దాదీ మా”, “నాని మా” అనే పేర్లతోనూ పిలిచేవారు. వత్సల మృతితో వన్యప్రాణుల చరిత్రలో ఒక అధ్యాయం ముగిసిందని సీనియర్ అటవీ అధికారి ఒకరు పేర్కొన్నారు. అటవీ అధికారులు, సిబ్బంది సమక్షంలో ఆ ఏనుగుకు అంత్యక్రియలు నిర్వహించినట్లు పన్నా టైగర్ రిజర్వ్ తెలిపింది.
Wildlife Mourns: ‘Dai Maa’ Vatsala, Panna Tiger Reserve’s Oldest Elephant, Passes Away at 100+
Read On-https://t.co/PLZVTgEZZO@PannaTigerResrv @mpforestdept @wti_org_india #Elephants #OldestElephant #Vatsala #pannatigerreserve #Wildlife #ForestNews #WildlifeIndia pic.twitter.com/No4X1hBD9t
— Indian Masterminds (@i3masterminds) July 8, 2025
వత్సల ప్రస్థానం మొదలైందిలా..
వత్సల(Vatsala) ప్రస్థానం కేరళ(Kerala)లోని నీలంబూర్ అడవుల్లో ప్రారంభమైంది. అక్కడ కలప రవాణా పనులకు ఉపయోగపడిన వత్సలను, 1971లో మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత 1993లో పన్నా టైగర్ రిజర్వ్‌కు తీసుకొచ్చారు. సుమారు దశాబ్ద కాలం పాటు పులుల జాడను గుర్తించే బృందంలో కీలక పాత్ర పోషించి, వన్యప్రాణి సంరక్షణకు ఎంతగానో దోహదపడింది.






