Nayanthara: ‘చంద్రముఖి’ క్లిప్స్ వాడకం.. నయనతారపై రూ.5 కోట్ల దావా!

లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) వ్యక్తిగత, వృత్తిగత జీవితంపై తెరకెక్కిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్(Nayanthara Beyond the Fairytale)’ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఓ కాపీరైట్ వివాదం(Copyright Dispute) ఎదుర్కొంటున్న ఈ డాక్యుమెంటరీపై తాజాగా మరో భారీ దావా నమోదైంది. సూపర్ హిట్ చిత్రం ‘చంద్రముఖి(Chandramukhi)’కి సంబంధించిన ఫుటేజీని తమ అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపిస్తూ ఏపీ ఇంటర్నేషనల్(AP International) అనే సంస్థ డాక్యుమెంటరీ నిర్మాతలపై, OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌(Netfilx)పై రూ. 5 కోట్ల దావా వేసింది.

ఆ క్లిప్పింగ్స్ అనుమతి లేకుండా వాడినందుకే..

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు(Madras High Court), డాక్యుమెంటరీ నిర్మాతలైన టార్క్ స్టూడియో LLPకి, నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. ‘చంద్రముఖి’ సినిమా ఆడియో, వీడియో హక్కులు(Audio and video rights) తమ వద్దే ఉన్నాయని, యూట్యూబ్(Youtube) నుంచి సేకరించిన క్లిప్స్‌ను తమ అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో చట్టవిరుద్ధంగా ఉపయోగించారని ఏపీ ఇంటర్నేషనల్((AP International)) తన పిటిషన్‌(Petition)లో ఆరోపించింది. ఈ విషయంపై తాము మొదట లీగల్ నోటీసు పంపగా, ఆ తర్వాతే నిర్మాతలు తమను లైసెన్స్ కోసం సంప్రదించారని సంస్థ తెలిపింది.

గతంలో రూ. 10 కోట్ల దావా వేసిన ధనుష్

దీంతో తమ సినిమా క్లిప్స్‌ను డాక్యుమెంటరీ నుంచి తక్షణమే తొలగించాలని, రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. కాగా నయనతారపై గతంలో నటుడు, నిర్మాత ధనుష్(Dhanush) కూడా తన నిర్మాణ సంస్థలో తీసిన ‘నానుమ్ రౌడీ దాన్(Nanum Rowdy Dhaan)’ సినిమా ఫుటేజీని అనుమతి లేకుండా వాడారని ఆరోపిస్తూ నయనతారపై రూ. 10 కోట్ల దావా వేసిన సంగతి తెలిసిందే.

Nayanthara vs Dhanush: Who is right? Producers and lawyer weigh in - India  Today

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *