భాషా భేదం లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna). తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ప్రతి ఇండస్ట్రీలోనూ ఆమెకు క్రేజ్, డిమాండ్ అమాంతం పెరిగిపోతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ఎక్కువగా డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా నిలిచింది రష్మిక. షూటింగ్‌లతో బిజీగా ఉండే ఆమె, తాజాగా ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్‌తో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఫ్యాషన్ రంగంలో పేరొందిన ‘డర్టీ కట్ 25’ మ్యాగజైన్(irty Cut Magazine) కవర్ కోసం ఆమె చేసిన తాజా ఫోటోషూట్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోటోల్లో ఆమె ఎర్రటి లిప్‌స్టిక్‌తో, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో ప్రత్యేకంగా మెరిసింది. ఈ లుక్ చాలా మందిని ఆకట్టుకోగా, కొంత నెగెటివ్ కామెంట్లు కూడా వచ్చాయి. నటి అమలాపాల్ సహా పలువురు సెలబ్రిటీలు రష్మిక లుక్‌ను ప్రశంసించారు.
View this post on Instagram
ఇప్పటికే పుష్ప 2, చావా, కుబేర వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. ఈ లుక్తో పాటు ఆమె కెరీర్ కూడా కొత్త హైట్స్‌కి చేరుతోంది. అంతేకాదు, ఈ మ్యాగజైన్ కథనంలో ఆమె ఇండస్ట్రీలో సాధించిన విజయాలను కూడా ప్రశంసించారు.
అయితే, ఇటీవల రష్మిక అనుకోకుండా ఓ వివాదంలో కూడా చిక్కుకుంది. కొడగు నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి నటి తానేనని చెప్పడంతో చాలా మంది తప్పు పట్టారు. ఆమెకు ముందే ప్రేమ, హర్షిక పూనాచ, శ్వేత చంగప్ప, అశ్విని నాచప్ప వంటి ప్రముఖులు రష్మిక కంటే ముందే చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.






