పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veera Mallu) గురించి ఇటీవల కొన్ని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం తెలంగాణకు చెందిన ఒక చారిత్రక నాయకుడి జీవితం ఆధారంగా తెరకెక్కిందని వార్తలు వెలువడుతున్నప్పటికీ, చిత్ర బృందం వాటిని ఖండించింది. ఇది నిజ జీవితంలో ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగా తెరకెక్కించలేదు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా ఇది తెరకెక్కింది.
దర్శకుడు జ్యోతి కృష్ణ(Jyothi Krishna) కథకు పునర్నిర్మాణం చేసిన తర్వాత హరి హర వీరమల్లు కథ పూర్తిగా మారిపోయింది. పురాణాల స్ఫూర్తితో, సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ ధర్మయోధుడి కథగా ఈ చిత్రం మారింది. టైటిల్‌లోని ‘హరి’ అంటే విష్ణువు, ‘హర’ అంటే శివుడు. ఈ రెండింటి మేళవింపే ఈ కథకు కేంద్ర బిందువుగా నిలిచింది. విష్ణువు వాహనమైన గరుడానికి సూచనగా డేగను, శివుడి ప్రతీకగా డమరుకాన్ని కథానాయకుడు ధరించిన విధానం ఈ అంశాన్ని బలంగా ప్రతిబింబిస్తోంది.
ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం(M.M Rathnam) అత్యధిక బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో భారీ చిత్రాలను నిర్మించి విజయాలను అందుకున్న రత్నం, ఈ చిత్రంపై కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఆయన ఓవర్సీస్, హిందీ హక్కులను తప్ప, మిగతా ప్రాంతీయ హక్కులను ఇప్పటికీ అమ్మకానికి ఉంచలేదు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు విపరీతమైన స్పందన లభించడంతో, పంపిణీదారుల మధ్య హక్కుల కోసం పోటీ తీవ్రంగా కొనసాగుతోంది.
ఇందులో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర శివుడు-విష్ణువుల సమ్మేళనంగా, ధర్మాన్ని రక్షించడానికి శక్తులై మారే ఒక వీరుని వ్యక్తీకరిస్తుంది. ఇది పవన్ కళ్యాణ్‌కి తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం, అలాగే భారతీయ సాంప్రదాయాలపై ఆధారపడిన కథ కావడం చిత్రంపై అంచనాలను పెంచింది. ఈ మూవీలో బాబీ డియోల్(Bobby Deol) మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో కనిపిస్తుండగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) కీలక పాత్రలో నటిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.






