టాలీవుడ్(Tollywood) స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu), బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Bollywood director Raj Nidimoru)ల మధ్య బంధం గురించి మరోసారి సోషల్ మీడియా (Social Media)లో వార్తలు వైరల్‌గా మారాయి. తాజాగా, వీరిద్దరూ కలిసి ఓ కార్యక్రమంలో సన్నిహితంగా కనిపించిన ఫొటో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోలో రాజ్‌తో కలిసి నవ్వుతూ, చేయి పట్టుకుని కనిపించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ ఫొటో ‘శుభం(Shubham)’ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్‌లో దిగినట్లు తెలుస్తోంది. ఇందులో రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం
కాగా ఈ ఫొటో వైరల్ కావడంతో, వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. గతంలో తిరుపతి(Tirupathi), శ్రీకాళహస్తి ఆలయాల్లో కలిసి కనిపించడం, పికిల్‌బాల్ టోర్నమెంట్(Pickleball tournament)లో ఒకరి పక్కన ఒకరు ఉండటం వంటి సంఘటనలు కూడా ఈ రూమర్స్‌కు బలం చేకూర్చాయి. అయితే, సమంత మేనేజర్ ఈ వార్తలను ఖండిస్తూ, వీరి మధ్య కేవలం వృత్తిపరమైన స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. మరోవైపు, రాజ్ భార్య శ్యామలీ దే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన క్రిప్టిక్ పోస్టులు కూడా ఈ విషయంపై చర్చలను రేకెత్తించాయి.
View this post on Instagram






