
రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది 2026లో నిర్వహించే జనగణన(census) ఆధారంగా జరుగుతుందని సమాచారం. అసెంబ్లీ స్థానాలు పెరిగితే.. APలో 175 నుంచి 225కి, TGలో 119 నుంచి 153కి అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. అసెంబ్లీ స్థానాలు పెరిగితే.. లోక్ సభ స్థానాలు(Lok Sabha seats) కూడా పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఇరు రాష్ట్రాల్లోనూ రాజకీయ సమీకరణాలు మారే ఛాన్స్ ఉంటుందని విశ్లేషకులంటున్నారు.
నియోజకవర్గాల స్థానాలు పెంచాలంటే..
ఇది ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలకు కొత్త సవాలుగా మరే అవకాశాల ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అసెంబ్లీ స్థానాల పెంపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి లోబడి ఉంటుంది. నియోజకవర్గాల స్థానాలు పెంచాలంటే నియోజకవర్గాల పునర్విభజన(Redistribution of constituencies) అవసరం. ఈ ప్రక్రియ ఎన్నికల సంఘం(Election Commission) నిర్వహిస్తుంది. జనాభా(Population), రిజర్వేషన్(Reservation), ఇతర పరిపాలనా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. నియోజకవర్గాలు పెరిగితే ఏపీలో SC స్థానాలు 29 నుంచి 38కి, ST స్థానాలు 7 నుంచి 12కి పెరుగుతాయి. అలాగే తెలంగాణలో SC స్థానాలు 19 నుంచి 24కి, ST స్థానాలు 12 నుంచి 14కి పెరిగే అవకాశం ఉంది.