టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మహిళపై ఓ అసిస్టెంట్ డైరెక్టర్ (Assistant Director) అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. మూవీల్లో ఆఫర్లు(Offers on movies) ఇప్పిస్తానంటూ నమ్మించి రేప్ చేసినట్లు సమాచారం. ఆడిషన్స్(Auditions) పేరుతో గదిలోకి పిలిచి ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఆ ఆసిస్టెంట్ డైరెక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రంగంలోకి దిగిన పోలీసులు
దీంతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు(Jubilee Hills Police) సదరు అసిస్టెంట్ డైరెక్టర్ మీద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా నిందితుడిపై BNS 64,79,115,351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. దీనిపై టాలీవుడ్ పెద్దలు స్పందించాల్సి ఉంది. అయితే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరనేది తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల జానీ మాస్టార్(Johnny Master) సైతం ఓ లేడీ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించాడంటూ సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో జానీ మాస్టార్ జైలుకు కూడా వెళ్లాడు. ప్రస్తుతం ఆయన బెయిల్(Bail) ఉన్న విషయం తెలిసిందే.








