పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గతేడాది థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు మరోసారి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీక్వెల్ పనులు కూడా షురూ చేశారు. తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ‘కల్కి 2 (Kalki 2)’ సినిమాలో ఓ ఇంటర్వ్యూలో గురించి మాట్లాడారు.
ఆ ముగ్గురే ఎక్కువగా కనిపిస్తారు
‘‘కల్కి 2’ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుంది. సెకండ్ పార్ట్ అంతా కమల్ హాసన్ (Kamal Haasan) గురించే ఉంటుంది. ప్రభాస్, కమల్ మధ్య ఎక్కువ సీన్స్ ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ ముగ్గురి పాత్రలే ఎక్కువగా ఈ సినిమాలో కనిపిస్తాయి. వీరితో పాటు దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. కథకు అవసరమైతే రెండో పార్ట్‌లో కొత్త వాళ్లు ఉండే అవకాశం ఉంది’’ అని అశ్వినీదత్ (Aswani Dutt) చెప్పుకొచ్చారు.
సరికొత్త ప్రపంచం కల్కి..
వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ సినిమా ద్వారా నాగ్ అశ్విన్ (Nag Ashwin) సినీ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఇక ఇందులో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామగా, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్.. సుప్రీం యాస్కిన్‌గా తమ పర్ఫామెన్స్ ఇరగదీశారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కామియో రోల్స్ తో సందడి చేశారు.






