
విజువల్ వండర్ అనిపించేలా సినిమాలు తీస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఆయన తీసిన ‘అవతార్’ (Avatar) రెండు పార్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొంది వసూళ్లలో తిరుగులేని రికార్డులు నెలకొల్పాయి. ఇక కామెరూన్ తీస్తున్న మూడో పార్ట్ ‘అవతార్–ఫైర్ అండ్ యాష్’(Avatar 3) కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జులై 25న ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’తో..
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ క్లిప్‌ను రిలీజ్ చేసింది. బ్రిటిష్ నటి ఊనా చాప్లిన్ పోషించిన విలన్ ‘వరంగ్’ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఆమె పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మూవీ ఫస్ట్ ట్రైలర్ జులై 25న ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ (Fantastic Four: First steps) సినిమాతో పాటు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శనకు ముందు అవతార్ 3 ట్రైలర్(Avatar 3 Trailer)ను చూపించనున్నట్లు పేర్కొన్నారు.
Meet Varang in Avatar: Fire and Ash.
Be among the first to watch the trailer, exclusively in theaters this weekend with The Fantastic Four: First Steps. pic.twitter.com/MZi0jhBCI5
— Avatar (@officialavatar) July 21, 2025
2009లో ‘అవతార్’ ఓ సంచలనం
2009లో రిలీజ్ అయిన ‘అవతార్’ ఓ సంచలనం. పండోరా అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలు, జువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఆ తర్వాత ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదల చేశారు. ఆ సీక్వెల్ కలెక్షన్లలో రికార్డులు కొల్లగొట్టింది. అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో ‘అవతార్- ఫైర్ అండ్ యాష్’ పేరుతో మూడో సీజన్ రాబోతోంది. డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక ‘అవతార్ 4’ 2029లో, చివరి సీజన్ ‘అవతార్ 5’ డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది.