‘Avatar 3’ First Look: ‘అవతార్ 3’ ఫస్ట్ లుక్ వచ్చేసింది… ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు అంటే?

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్(Director James Cameron) సృష్టించిన అద్భుత సైన్స్ ఫిక్షన్ సిరీస్‌ ‘అవతార్’. ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమా ‘అవతార్3 (Avatar 3): ఫైర్ అండ్ యాష్’ రాబోతుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌ (First Look Release) విడుదల చేసింది. దీనికి ‘వరంగ్’(Varang) అనే క్యాప్షన్ జత చేసి, కొత్త పాత్రను పరిచయం చేశారు. పండోరా ప్రపంచంలోని ప్రధాన పాత్రలైన జేక్, నేయిత్రి, కిరి, కల్నల్‌ లాంటి క్యారెక్టర్లు ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయమే. కానీ ఈ కొత్త లుక్‌ ద్వారా కథలో కొత్త మలుపు ఆశించవచ్చని అభిమానులు భావిస్తున్నారు.

ఈ లుక్ విడుదలతోపాటుగా, ‘అవతార్ 3’ ట్రైలర్(Avatar 3 Trailer Release) గురించి కూడా అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ట్రైలర్‌ను ఈ వారం విడుదల కానున్న ‘ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ సినిమాతో పాటు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. అంటే జూలై 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న ‘ఫెంటాస్టిక్ ఫోర్’ సినిమాను థియేటర్లలో చూస్తే, అవతార్ 3′ ట్రైలర్‌ థియేటర్లలో ప్లే అవుతుంది అన్నమాట.

మరోవైపు, ‘అవతార్ 3’ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయనున్నారు. ఇండియాలో గత రెండు అవతార్ సినిమాలు ఘన విజయాన్ని సాధించడంతో, ఇప్పుడు ‘ఫైర్ అండ్ యాష్’పై కూడా ట్రేడ్ సర్కిల్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Avatar (@avatar)

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *