హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్(James Cameron) సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్(Avatar)’ సిరీస్‌లో మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్(Avatar Fire and Ash)’ ట్రైలర్(Trailer) విడుదలైంది. ఈ ట్రైలర్‌ను జులై 25న ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్(The Fantastic Four: First Steps)’ సినిమాతో పాటు థియేటర్లలో ప్రదర్శించారు. పండోరా గ్రహం(Pandora planet)పై అగ్ని నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్(Visual effects)తో ప్రేక్షకులను మరోసారి మాయా లోకంలోకి తీసుకెళ్లనుంది. తాజా గా ఈ ట్రైలర్ ను అవతార్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
![]()
అగ్ని, బూడిద థీమ్‌ను ప్రతిబింబిస్తూ
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్(First look poster)లో బ్రిటిష్ నటి ఊనా చాప్లిన్(Oona Chaplin) పోషించిన ‘వరంగ్’ పాత్రను పరిచయం చేశారు, ఇది నావి తెగలో కీలకమైన పాత్రగా ఉంటుందని తెలుస్తోంది. ట్రైలర్ అగ్ని, బూడిద థీమ్‌ను ప్రతిబింబిస్తూ, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో సహా బహుళ భాషల్లో ఈ విజువల్ ఫీస్ట్ ప్రేక్షకులను అలరించనుంది. అవతార్ అభిమానులకు ఈ ట్రైలర్ ఒక విజువల్ ట్రీట్‌గా నిలిచి, సినిమాపై ఉత్కంఠను రెట్టింపు చేసింది. మీరూ ఈ ట్రైలర్‌ను చూసేయండి..
From Director James Cameron, watch the trailer for Avatar: Fire and Ash.
Experience the film only in theaters December 19. pic.twitter.com/Y0D4EUGU7x
— Avatar (@officialavatar) July 28, 2025






