Axiom-4 Mission: నేడు అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా.. మధ్యాహ్నం 12 గంటలకు ముహూర్తం

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) అంతరిక్ష యాత్ర(Axiom-4 mission)కు సిద్ధమయ్యారు. ఈ రోజు (జూన్ 25) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(International Space Station)కి మరో ముగ్గురు హ్యోమగాముల(Astronauts)తో కలిసి ఆయన బయల్దేరనున్నారు. పలు కారణాలతో ఈ ప్రయాణం ఆరు సార్లు వాయిదా పడింది. ఈ ప్రయోగం ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌(NASA Kennedy Space Center)లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01 గంటలకు) అమెరికా(US)లో అయితే తెల్లవారుజామున 2:31 గంటలకు ప్రారంభమవుతుంది.

14 రోజుల పాటు ఐఎస్ఎస్‌లో ప్రయోగాలు

శుక్లా(Shukla)తో పాటు అమెరికా, హంగేరీ, పోలాండ్‌(Poland)కు చెందిన వ్యోమగాములు కూడా ఈ మిషన్‌లో పాల్గొంటారు. అక్కడ 14 రోజుల పాటు వివిధ శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నడిచే కొత్త స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక(New SpaceX Dragon spacecraft)లో ISSకి చేరుకుంటారు. ఇండియన్ టైం ప్రకారం.. జూన్ 26 గురువారం ఉదయం వారు ISS స్పేస్‌షిప్‌కు డాకింగ్ చేయనున్నారు. ఈ మిషన్‌కు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ నాయకత్వం వహిస్తారు.

India's Shubhanshu Shukla set to fly to ISS on June 25 - Rediff.com

15 రోజుల్లో 6 సార్లు వాయిదా

ఆమెతో పాటు ఇస్రో వ్యోమగామి శుభాన్షు శుక్లా పైలట్‌(Pilot)గా ఉన్నాడు. వీరితోపాటు మరో ఇద్దరు పోలాండ్ నుంచి ESA ప్రాజెక్ట్ ఆస్ట్రోనాట్ స్వావోస్జ్ ఉజ్నాన్స్కి-విస్నివ్స్కీ, హంగేరీ నుంచి టిబోర్ కాప్‌లు ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నారు. గత 15 రోజుల్లో 6 సార్లు వాయిదా పడుతూ వస్తున్న.. ఈ యాక్సియం-4 మిషన్ ఎట్టకేలకు బుధవారం ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించి.. మంగళవారం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా(NASA) అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Related Posts

Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *