Iran-Israel War: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం.. 224 మంది మృతి

ఇరాన్-ఇజ్రాయెల్(Iran-Israel War) మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. దీంతో ఇరుదేశాల్లోని వందలాది మంది ప్రజలు కంటిమీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇక ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో తమ దేశానికి చెందిన పౌరులు 224 మంది మరణించారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ(Iran Health Ministry) పేర్కొంది. మరో 1,277 మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఇక మృతుల్లో 90% కంటే ఎక్కువ మంది పౌరులేనని ఇరాన్ ఆరోగ్యశాఖ ప్రతినిధి హుస్సేన్ ఖేర్మాన్‌పూర్ చెప్పారు.

🔴 Israel-Iran war live: Iran warns of "devastating response" to Israel  attacks

అణు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు

కాగా ఇరాన్ అణు, సైనిక స్థావరాల(Nuclear and military bases)ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించడంతో రెండు దేశాల మధ్య పరిస్థితి మరింత తీవ్రమైంది. ఈ దాడుల్లో అనేక మంది అగ్ర జనరల్స్, అణు శాస్త్రవేత్తలు మరణించారు. అలాగే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ కజేమీ(General Mohammad Kazemi), డిప్యూటీ జనరల్ హసన్ మొహాకిక్, టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారని ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ప్రకటించారు.

Israel-Iran war: exporters fear rise in logistic costs - Economy News | The  Financial Express

ఇరాన్ దాడుల్లో 390 మంది మృతి

అలాగే ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన సైనికులు(Soldiers) 14 మంది, మరో 390 మంది సాధారణ పౌరులు మరణించారని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. అలాగే ఇరాన్ ఇజ్రాయెల్‌పై 270 కి పైగా క్షిపణులను ప్రయోగించిందని రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా ఆయుధ కర్మాగారాల్లో(weapons factories) పని చేస్తున్న, దాని పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఇరానియన్లు వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అటు ఆక్రమిత ప్రాంతాల వద్ద ఉండకూడదని స్పష్టం చేసింది. మొత్తానికి రెండు దేశాల్లో యుద్ధం భయం సాధారణ ప్రజల ప్రాణాల మీదికి వచ్చింది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *