Ayodhya Temple: ఈనెల 11 నుంచి అయోధ్య రామయ్య తొలి వార్షికోత్సవాలు

ఉత్తరప్రదేశ్‌ని అయోధ్య రామయ్య(Ayodhya Ram) మొదటి వార్షికోత్సవాల(Ram temple 1st anniversary celebrations)కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రామ్ లల్లాకు పట్టాభిషేకం(Coronation of Ram Lalla) జరిగి ఏడాది పూర్తవుతున్న క్రమంలో ఈ జనవరి 11న తొలి వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఈమేరకు 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు(Sri Rama Janmabhoomi Tirtha Kshetra Trust) నిర్ణయించింది. ప్రతిష్ఠా ద్వాదశిగా నిర్వహించనున్న ఈ వేడుకలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) రామ్ లల్లాకు మహా హారతి ఇచ్చి ప్రారంభించనున్నారు. మరోవైపు ఆలయ పరిసరాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

మహాహారతి సమర్పించనున్న సీఎం యోగి

ఇదిలా ఉండగా ఈ వేడుకలకు భక్తులు(Devotees) భారీగా తరలిరానున్నారు. దీంతో VIP, VVIP దర్శనంపై నిషేధం విధించినట్లు ట్రస్టు అధికారులు తెలిపారు. జనవరి 11 నుంచి 13 వరకు శ్రీరామ మందిర VIP దర్శనం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు సంబంధించి జనవరి 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామలల్ల అలంకారం, మహా అభిషేకం, మహా హారతి నిర్వహించనున్నట్లు తెలిపారు. CM యోగి ఆదిత్యనాథ్ నిర్వహించనున్నారు.

ప్రాణ ప్రతిష్ఠ(Prana Pratishtha) మొదటి వార్షికోత్సవానికి పరిపాలన అధికారులు కూడా పూర్తి స్థాయిలో సన్నాహాలు చేశారు. గురువారం డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్, జిల్లా మెజిస్ట్రేట్, పలువురు అధికారులు వేదికను పరిశీలించారు. అనురాధ పౌడ్వాల్, మాలినీ అవస్తి, కుమార్ విశ్వాస్ జనవరి 12 , 13 తేదీలలో తమ కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *