బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘బజరంగీ భాయిజాన్(Bajrangi Bhaijaan)’. 2015లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఆ మూవీలోమాటలని రాని చిన్నారి మున్ని పాత్రలో కనిపించి ప్రేక్షకుల మది గెలుచుకుంది నటి హర్షాలీ మల్హోత్ర (Harshaali Malhotra). ఇప్పుడీమె టాలీవుడ్(Tollywood) ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఆమె ఏకంగా ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) మూవీలోనే ఛాన్స్ కొట్టేసింది. బాలయ్యబాబు హీరోగా తెరకెక్కుతోన్న సరికొత్త చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2)లో హర్షాలీ నటిస్తోంది. ఇదే విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో ఆమె జనని(Janani) పాత్రలో కనిపించనున్నారని వెల్లడించింది. ఈ మేరకు టీమ్‌లోకి ఆమెను స్వాగతిస్తూ పోస్ట్ పెట్టింది.
HARSHAALI MALHOTRA TO STAR IN ‘AKHANDA 2’, STARRING BALAKRISHNA… After winning hearts as #Munni in #BajrangiBhaijaan, #HarshaaliMalhotra returns to the big screen with #Akhanda2.
She essays the pivotal role of #Janani in the much-awaited film starring #NandamuriBalakrishna.… pic.twitter.com/9zAyVizE5i
— taran adarsh (@taran_adarsh) July 2, 2025
బాలనటిగా కెరీర్ మొదలు పెట్టి..
ముంబైకి చెందిన హర్షాలీ మల్హోత్ర(Harshaali Malhotra) బాలనటిగా కెరీర్ మొదలుపెట్టారు. హిందీలో తెరకెక్కిన పలు సీరియల్స్‌లో నటించారు. 2015లో విడుదలైన ‘బజరంగీ భాయిజాన్’ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. బధిర బాలిక పాత్రలో ఆమె నటన సినీ ప్రియుల హృదయాలను హత్తుకుంది. ఈ చిత్రానికి గాను పలు అవార్డులు సైతం లభించాయి. బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కాంబోలో దైవిక అంశాలతో రూపొందిన యాక్షన్ డ్రామా మూవీ ‘అఖండ(Akhanda)’ 2021లో విడుదలై మంచి విజయం సాధించింది.

సెప్టెంబరు 25న థియేటర్లలో అఖండ 2: తాండవం
ఇక తాజాగా దానికి కొనసాగింపుగా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతోంది. ఈ మూవీలో సంయుక్త మేనన్(Samyukta Memon), ఆది పినిశెట్టి(Adhi Pinshetty) ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. తొలిభాగంలో నటించిన జగపతిబాబు తదితరులు సీక్వెల్‌లోనూ నటిస్తున్నారు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం దసరా సందర్భంగా సెప్టెంబరు 25న విడుదల కానుంది.







