ప్రముఖ నిర్మాత శిరీష్(Sirish), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కు, ఆయన అభిమానులకు మరోసారి క్షమాపణలు(Apologies) తెలిపారు. ఇటీవల ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ సినిమా గురించి తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, శిరీష్ నిన్న ఓ లేఖ(Letter)లో క్షమాపణ చెప్పారు. తాజాగా, స్వయంగా ఓ వీడియో(Video) ద్వారా వివరణ ఇచ్చారు. రామ్ చరణ్‌ను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, తమ మధ్య ఉన్న స్నేహంతో పొరపాటున మాట దొర్లిందని స్పష్టం చేశారు.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకం(Sri Venkateswara Creations banner)పై రామ్ చరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితం గురించి ఇటీవల శిరీష్ మాట్లాడుతూ.. హీరో, దర్శకుడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రామ్ చరణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, శిరీష్ మొదట ఓ లేఖను, తాజాగా ఓ వీడియోను విడుదల చేసి వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.
నేనెంతో అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ ఒకరు
ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ, “చిరంజీవి(Chiranjeevi) గారికి, రామ్ చరణ్(Ram Charan)కు, మా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థకు మధ్య విడదీయరాని బంధం ఉంది. నేను ఎంతో అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ వదులుకోవాలనుకోను. అభిమానుల బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ నేను ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు అనలేదు” అని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారో ఈ కింది వీడియోలో చూడండి.
Official statement from our Producer Shirish Garu. pic.twitter.com/I4mv9r18w7
— Sri Venkateswara Creations (@SVC_official) July 2, 2025






