నటసింహ బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా, బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో `అఖండ2` శివ తాండవం(Akhanda 2: Shiva Thandavam) శర వేగంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్(HYD) సహా కుంభమేళా(Kumbhamelaలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అఖండ-2 మొదలైన సమయంలోనే కుంభమేళా కూడా రావడంతో మూవీకి మరింత కలిసొచ్చింది. ఇప్పటి వరకూ ఈ సినిమా షూటింగ్ ఈ రెండు ప్రాంతాల్లోనే జరిగింది. ఇంత వరకూ ఔట్ డోర్ చిత్రీకరణకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో తర్వాతి పార్ట్ షూటింగ్(Shooting) ప్లేస్ గురించి సినీవర్గాల్లో చర్చనడుస్తోంది.
జార్జియా బ్యాక్ డ్రాప్‌లోనే..
తాజా సమాచారం మేరకు అఖండ 2 షూటింగ్ (Akhanda 2 Shooting)తదుపరి షెడ్యూల్ జార్జియా(Georgia)లో మొదలవుతుందట. అక్కడ సినిమాకు సంబంధించిన మరికొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఘట్టాలు(Action Scenes) చిత్రీకరించనున్నారుట. దీనిలో భాగంగా వేలాది మంది అఘోర(Aghora) గెటప్స్‌లో ఆయా సన్నివేశాల్లో పాల్గొంటారని సమాచారం. అలాగే ఓ భారీ ప్రదేశంలో ఈ సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట. సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలన్ని జార్జియా బ్యాక్ డ్రాప్‌లోనే ఉంటాయట. హిందుత్వం కాన్సెప్ట్ కావడంతో పాన్ ఇండియా(Pan India)లో ఈ చిత్రాన్ని కెనెక్ట్ చేయడానికి ఎక్కడా రాజీ పడకుండా టీమ్ పనిచేస్తోంది.
వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి?
ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), కావ్యా థాపర్, జగపతి బాబు, ఎస్.జే. సూర్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. కాగా ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం ఈ మూవీ సెప్టెంబర్ 25కి థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ ఆ సమయానికి షూటింగ్, VFX తదితర పనులు పూర్తయ్యే ఛాన్స్ లేకపోవడంతో వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.






