నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘అఖండ 2(AKhanda 2)’. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), కావ్యా థాపర్, జగపతి బాబు, ఎస్.జే. సూర్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట (Ram Achanta), గోపీ ఆచంట (Gopi Achanta) నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా విడుదల కానుంది. తాజాగా బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్(Teaser)ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య బాబు సినిమా ట్రైలర్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది.
యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్
‘అఖండ 2: తాండవం(Akhanda 2: Tandavam)’ సినిమా టీజర్ విడుదలైన 24 గంటల్లోనే సరికొత్త రికార్డులను సృష్టించింది. 28 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా నిలిచింది. అలాగే 632K లైక్స్ సాధించి, తెలుగు సినిమా టీజర్లలో ఆల్-టైమ్ టాప్-5లో చోటు సంపాదించింది. కాగా ఇదే సినిమా టీజర్‌కు 24 గంటల్లోనే 5.90 లక్షలకు పైగా లైక్‌లు రాగా, సీనియర్ హీరోల సినిమా టీజర్లలో ఆల్-టైమ్ రికార్డుగా నిలిచింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ, అభిమానులు, సినీ ప్రియులలో మూవీపై భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.
The Massiest form of the divine force 💥💥🔱#Akhanda2Teaser TRENDING #1 on YouTube with 28 MILLION+ VIEWS & 632K+ LIKES ❤🔥
▶️ https://t.co/T4W32cDtqD#Akhanda2 THANDAAVAM IN THEATRES DUSSEHRA 25th SEPTEMBER #Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna… pic.twitter.com/KtqF4neQ1p— 14 Reels Plus (@14ReelsPlus) June 11, 2025






