‘చిన్నారి పెళ్లికూతురు’ నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న అవికా గోర్

తెలుగు ప్రేక్షకులకు చిన్నారి పెళ్లికూతురు(Chinnari Pelli Kuthuru) సీరియల్‌ ద్వారా పరిచయమైన బాలనటి అవికా గోర్(Avika Gor) తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిలింద్ చాంద్వానీ(Milind Chandwani )తో ఆమె ప్రేమ వివాహానికి సిద్ధమవుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జూన్ 12, బుధవారం జరిగిన నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను అవికా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేస్తూ ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది.

అవికా గోర్, మిలింద్ చాంద్వానీ ప్రేమలో ఉన్నట్లు గతంలోనే బహిరంగంగా ప్రకటించారు. చాలాకాలంగా కలిసి ఉన్న ఈ జంట ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికంగా మరో మెట్టు ఎక్కించారు. హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

ఈ శుభవార్తను వెల్లడిస్తూ అవికా ఓ నోటును కూడా పోస్ట్ చేశారు. ‘‘అతను ప్రపోజ్ చేశాడు. నేను నవ్వాను. ఆ క్షణం నా జీవితంలో అతి సులభమైన ‘యెస్’ ఇదే. అతను తన మనసులో మాట చెబుతుంటే నాకు సినిమా లాంటి అనుభూతి వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినిపించింది, స్లో-మోషన్ డ్రీమ్స్ కనబడ్డాయి. అతను ప్రశాంతంగా, స్పష్టంగా మాట్లాడుతుండగా, నాకు గాల్లో తేలుతున్న అనుభూతి కలిగింది. నా కళ్లలో ఆనంద కన్నీళ్లు తిరిగాయి. ఇది నిజమైన ప్రేమ. ఇది ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. కానీ ఇది ఒక మ్యాజిక్‌’’ అంటూ తన ప్రేమకథను సినిమాటిక్ స్టైల్‌లో వివరించింది.

ప్రస్తుతం 27 ఏళ్ల అవికా గోర్ బాలనటిగా తెరంగేట్రం చేసి, ఆ తర్వాత హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె తెలుగులో ‘ఉయ్యాల జంపాలా’, ‘కేరింత’, ‘రాజుగారి గది 3’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు జీవిత భాగస్వామిగా మిలింద్‌ను ఎంచుకున్న అవికా త్వరలోనే వివాహం చేసుకోబోతోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *