మోక్షజ్ఞ హీరోగా ‘ఆదిత్య 999’.. కన్ఫామ్ చేసిన బాలకృష్ణ

Mana Enadu : నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ అరంగేట్రం ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. హనుమాన్ ఫేం, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashant Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ తెలుగు తెరపైకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కక ముందే మోక్షజ్ఞ ఖాతాలో మరో ప్రాజెక్టు వచ్చి చేరింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తండ్రి బాలయ్య బాబు షేర్ చేశారు. ఇంతకీ ఆ సినిమా సంగతులేంటో తెలుసుకుందామా..? 

‘ఆదిత్య 369’ సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’

నందమూరి బాలకృష్ణ నటించిన ఐకానిక్‌ సినిమా ‘ఆదిత్య 369’ (Aditya 369)కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ 1991లో రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అందుకుంది. బాలయ్య సినిమాల్లో ఈ చిత్రానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ తప్పకుండా ఉంటుందని అప్పట్లో బాలయ్య ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గతంలో ఆయన ‘ఆదిత్య 369’ సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 (Aditya 999)’ ఉంటుందని తెలిపారు.

ఆదిత్య 999లో హీరోగా మోక్షజ్ఞ

తాజాగా బాలయ్య ఈ సీక్వెల్ విషయాలను పంచుకున్నారు. ఆయన హోస్టుగా చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4 (Unstoppable 4)’ లో ఈ చిత్ర విశేషాలపై మాట్లాడారు. ఆదిత్య 369కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ వస్తుందని.. అందులో తన కుమారుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) హీరోగా నటిస్తాడని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుందని వెల్లడించారు.  బాలకృష్ణ ఈ విశేషాలు షేర్ చేసుకున్న లేటెస్ట్ ఎపిసోడ్ డిసెంబర్‌ 6న ప్రసారం కానుంది.

బాలయ్య కెరీర్లో మైలురాయి ఆదిత్య 369

ఇక ఆదిత్య 369 సినిమా సంగతికి వస్తే.. టైమ్‌ మిషన్‌, టైమ్‌ ట్రావెల్‌ (Time Travel) నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ, మోహిని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలో హీరో పాస్ట్, ఫ్యూచర్ లోకి ప్రయాణించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో చూపించారు. అప్పట్లోనే ఈ సినిమాకు రూ.కోటిన్నర వరకు ఖర్చయింది. ఈ మూవీ బాలకృష్ణ సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోయింది. 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *