నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna)- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబోలో వస్తున్న భారీ సినిమా “అఖండ 2”(Akhanda2). గతంలో ఇదే కాంబోలో వచ్చి సూపర్ విక్టరీ కొట్టిన అఖండ సినిమాకు సీక్వల్ గా ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతోంది. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు కీలక అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ అవైటెడ్ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ మంచి అంచనాలు పెంచింది.
ఈ క్రమంలోనే తాజాగా అఖండ 2 షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ప్రయాగరాజ్ లో ప్లాన్ చేస్తున్నారట బోయపాటి. దాదాపు రెండు వారాలు అక్కడే షూటింగ్ చేస్తారట. ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ చేయనున్న ఈ షెడ్యూల్ లో చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారం. నందమూరి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. సంయుక్త మేనన్, ఆది పిన్ని శెట్టి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు మంచి విజయాన్ని సాధించడంతో అఖండ 2 అందరూ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.







