సూపర్స్టార్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. అయితే ఈ క్యారెక్టర్ ఆయన నటిస్తున్న ఫుల్ లెన్త్ సినిమాలో కాదు. జైలర్ సినిమాకు కొనసాగింపుగా రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 2 (Jailer 2) మూవీలో. సన్‌పిక్చర్స్ సంస్థ కళానిధి మారన్ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.
భారీ పారితోషికం
రజనీకాంత్ (Rajinikanth) కోసం జైలర్2లో నటించేందుకు బాలకృష్ణ ఒప్పుకున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ సంప్రదింపులు కూడా చేసిందని సమాచారం. ఎప్పుడూ ఫుల్లెన్త్ క్యారెక్టర్లతో అదరగొట్టే బాలయ్య ‘జైలర్ 2’లో పవర్ఫుల్ ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా కొద్దిసేపు కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు భారీగా పారితోషికం కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
5 నిమిషాల పాటు ఎలివేషన్ సీన్
గతంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా రౌడీ ఇన్‌స్పెక్టర్, లక్ష్మీ నరసింహ వంటి సినిమాల్లో పోలీస్ ఆఫీసర్గా నటించి మెప్పించారు. ఇప్పుడు చాలారోజుల తర్వాత జైలర్2 కోసం పోలీస్ యూనిఫామ్ ధరించనున్నారు. రజనీకాంత్, బాలయ్య మధ్య భారీ ఎలివేషన్ ఇచ్చే సీన్ ఉందని… అది దాదాపు 5నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది. మూవీలో శివరాజ్‌కుమార్ రమ్యకృష్ణ, మిర్నా మేనన్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిట్ 3తో విజయాన్ని అందుకున్న కన్నడ భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కూడా నటించనున్నట్లు తెలిసింది.






