రామ్ పోతినేతి (Ram Pothineni), భాగ్య శ్రీ బోర్సే (Bhagyashri Borse) కాంబోలో మహేశ్ బాబు.పి తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన సూపర్ అప్డేట్ వచ్చేసింది. రామ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ గ్లిమ్స్ను రిలీజ్ చేశారు. ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ (Andhra King Taluka) అని మూవీ టైటిల్ను ఖరారు చేస్తూ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. ‘బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్’ అనేది ట్యాగ్ లైన్.
కీలక పాత్రలో ఉపేంద్ర
ఇక ఈ మూవీలో కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నట్లు గ్లిమ్స్ ద్వారా తెలుస్తోంది. సినిమా కథలో ఉపేంద్ర హీరో కాగా.. ఆయన్ని అభిమానించే వ్యక్తిగా రామ్ కనిపించనున్నాడు. రామ్ 22వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయ్యింది. మూవీ గ్లిమ్స్ను మీరూ చూసేయండి.






