USAలో బాలయ్య మేనియా.. రికార్డు వసూళ్లను క్రాస్ చేసిన ‘డాకు మహారాజ్’

ఈ సంక్రాంతి(Sankranti) పండుగకు బరిలో నిలిచిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పటికే పాజిటివ్ టాక్‌తో గేమ్ ఛేంజర్(Game Changer), డాకు మహారాజ్(Daaku Mahaaraj), సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam) మూవీలు థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. ఇందులో నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ(Bobby) కాంబినేషన్‌లో వచ్చిన ‘డాకు మహారాజ్’ ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తోంది. జనవరి 12న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా తొలి రోజే బ్లాక్‌బస్టర్‌ హిట్ టాక్ తెచ్చుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్లపైన సూర్యదేవర నాగ వంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలయ్య తన అద్భుతమైన నటనతో అదరగొట్టాడు.

వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరోగా బాలయ్య

ఇక థియేటర్లలో సందడి చేస్తూ రికార్డులను కూడా బద్దలు కొడుతున్నాడు బాలయ్య. ఆయన నటించిన ప్రతీ సినిమాలోనూ అభిమానులను ఆకట్టుకునే తన మార్క్(Mark) చూపిస్తున్నాడు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్(Daaku Mahaaraj) సినిమా మొదటి రోజు రూ.56 కోట్లు వసూళ్లను రాబట్టి బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌(Biggest opener)గా నిలిచింది. ఇక ఇదే సమయంలో బాలయ్య సాధించిన మరో విజయంపైనా ప్రజెంట్ చర్చ నడుస్తోంది. USAలో వరుసగా 4 సినిమాలు రిలీజ్ చేసి హిట్ టాక్ పొందిన వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్(Tollywood) హీరోగా బాలయ్య అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

తెగ ఖుషీ అవుతున్న నందమూరి ఫ్యాన్స్

డాకు మహారాజ్ USA బాక్సాఫీస్ వద్ద 6.50 కోట్లు, ఒక మిలియన్ డాలర్స్ మార్క్ చేరుకుంది. ఇప్పటివరకు బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, అఖండ(Akhanda), భగవంత్ కేసరి సినిమాలతో పాటు ప్రస్తుతం డాకు మహారాజ్ కూడా 4వ సినిమాగా మిలియన్ డాలర్ మార్కును చేరుకుంది. ఇప్పటివరకు ఇట్లాంటి ఘనత వహించిన టాలీవుడ్ హీరో ఒక్క బాలకృష్ణ మాత్రమే కావడంతో ప్రస్తుతం అభిమానుల్లో జోష్ నెలకొంది. 64ఏళ్ల వయసులోనూ బాలయ్య తన మేనరిజం, అద్భుతమైన స్టెప్పులతో అదరగొడుతున్నారని నందమూరి ఫ్యాన్స్(Nandamuri Fans) ఖుషీ అవుతున్నారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *