నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు దీటుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. ఓవైపు వెండితెరపైన.. మరోవైపు ఓటీటీలో టాక్ షో హోస్టు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య బాబు చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. అందులో ఒకటి స్టార్ డైరెక్టర్ బాబీ (Director Bobby) దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
కౌంట్ డౌన్ షురూ
‘డాకు మహారాజ్ (Daku Maharaj)’ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2025 సంక్రాంతి పండుగకు (జవవరి 12న) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో నెల రోజుల ముందుగానే ప్రమోషన్స్ షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రోజున మూవీ రిలీజ్ కౌంట్ డౌన్ ప్రారంభిస్తూ.. మరో 50 రోజుల్లో డాకు మహారాజ్ థియేటర్లలో సందడి చేయనున్నాడంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
అమెరికాలో బాలయ్య జోరు
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయానికి వస్తే భారీ స్థాయి ప్లానింగ్ జరుగుతోందట. కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికా(Daku Maharaj America)లో ఉన్న బాలయ్య ఫ్యాన్స్ ను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్స్ అక్కడ చేయాలని భావిస్తున్నారుట. ఇందులో భాగంగా అమెరికాలో ‘డాకు మహారాజ్’ ఈవెంట్ గ్రాండ్‌గా చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనికి డల్లాస్ నగరం వేదిక కానుంది.
డల్లాస్ లో డాకు మహారాజ్ ప్రమోషన్స్
2025 జనవరి 4వ తేదీన సాయంత్రం 6 గంటలకు డల్లాస్ లో డాకు మహారాజ్ ప్రమోషన్స్ షురూ కాబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘డల్లాస్ (Dallas Daku Maharaj) డాకు మహారాజ్ జోన్ కాబోతుంది. హలో USA.. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండండి’ అనే క్యాప్షన్ తో ఓ పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. ఇక ఈ చిత్రాన్ని అమెరికాలో ప్రమోట్ చేయడం పట్ల అక్కడి బాలయ్య ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు.
బందిపోటుగా బాలకృష్ణ
ఈ సినిమా సంగతికి వస్తే ఇందులో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ (Bobby Deol) కీలక పాత్రలో కనిపించనున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీలో బాలయ్య బాబు బందిపోటుగా కనిపించనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.
,,,, Daku Maharaj promotions in America, Daku Maharaj release date