నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అంటే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ప్రతి చిత్రానికి తనదైన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కొత్త లెవల్ తీసుకెళ్తాడు. ఇకపోతే, నందమూరి అభిమానుల కోసం బాలకృష్ణ పుట్టినరోజు(జూన్ 10) సందర్భంగా ఓ భారీ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopi Chand Malineni). మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మళ్ళీ బాలయ్య బాబుతో చేతులు కలిపారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వీర సింహారెడ్డి ఎంతటి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే స్ఫూర్తితో మరో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం రెడీ అవుతున్నారు. బాలయ్య బాబు తదుపరి చిత్రం గోపీచంద్ మలినేని తో ఉండబోతుందని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు గోపీచంద్.
“గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్. ఈసారి మా గర్జన మామూలుగా ఉండదు. బాలకృష్ణ గారితో మరోసారి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది.” అని అధికారికంగా ప్రకటించాడు గోపీచంద్.

ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లో 111వ సినిమాగా రాబోతోంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్నారు. ఈ నిర్మాణ సంస్థకు ఇది అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం కానుంది. భారీ బడ్జెట్‌తో, టాప్ టెక్నీషియన్స్‌తో రూపొందించబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించగా, ఇప్పుడు మరింత పవర్‌ఫుల్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. జూన్ 10న, బాలయ్య బాబు పుట్టినరోజునే ఈ సినిమా ప్రారంభం కానుంది.
ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగంలోని అఘోర పాత్రకు ప్రేక్షకులు ఊగిపోయారు. ఇప్పుడు ఆ పాత్రను మరోసారి స్క్రీన్ మీద చూడాలని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్, టీజర్‌లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖండ 2 పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కాంబోలో తెరకెక్కే కొత్త సినిమా షూటింగ్ మొదలవుతుంది.






