నటసింహం నందమూరి స్టార్ హీరో బాలకృష్ణ(Balakrishna) వరుస మూవీలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. ఏజ్ పెరిగినా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా తనదైన స్టైల్లో ఇండస్ట్రీలో పోటీనిస్తూ యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్, డ్యాన్స్ ఇలా ఏదైనా ఇట్టే పట్టేస్తున్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్‌లోనూ బాలయ్య ఫుల్ బిజీబిజీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘డాకు మహారాజ్(Daaku Mahaaraj)’ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఈ నేపథ్యంలో మరో ప్రయోగానికి బాలయ్య రెడీ అయినట్లు టీటౌన్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇన్ డైరెక్టర్‌తో ప్రయోగాత్మక చిత్రంలో బాలయ్య నటించడానికి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసుకుందామా..
‘హిట్’ సిరీస్ బ్లాక్‌బస్టర్ హిట్టు
నేచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా పలు సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. అందులో ‘హిట్(HIT)’ సిరీస్ కూడా ఉంది. శైలేష్ కొలను(Shailesh Kolanu) దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మొదటి పార్టులో విశ్వక్ సేన్(Vishwak Sen), రెండో పార్టులో అడివి శేష్(Adivi Sesh), మూడో పార్టులో నాని(Nani) నటించారు. ఇక హిట్ ఫుల్ సినిమా గురించి ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల దృశ్య ఈ సినిమాలో నందమూరి హీరో బాలయ్య ప్రధాన పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది.
అఖండ-2తో బాలయ్య బిజీబిజీ
ఇటీవల పద్మభూషణ్(Padma Bhushan) పురస్కారం అందుకున్న బాలయ్యను ‘హిట్’ టీమ్ నాని, శేష్, శైలేష్ కొలను కలిశారు. హిట్ టీమ్ అంతా బాలయ్యను ఒకేసారి కలవడంతో ఈ ‘హిట్ 4(HIT-4)లో బాలయ్య నటించనున్నాడని వార్తలు ఊపొందుకున్నాయి. ఈ కాంబో సెట్ అయితే ఎంతో మంది విమర్శకుల నోర్లు మూతపడే అవకాశం ఉంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది. ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. రీసెంట్‌గా సంక్రాంతి సందర్భంగా డాకు మహారాజ్‌తో భారీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం బోయపాటి కాంబోలో AKHANDA-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బాలయ్య.








