శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై నిషేధం

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో (Srisailam Mallikarjuna Swamy Temple) అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడంపై నిషేధం విధించినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. అన్యమత సూక్తులను, చిహ్నాలను, బోధనలను, అన్యమతానికి సంబంధించిన ఫొటోలను కలిగి ఉన్న వాహనాలు కూడా క్షేత్ర పరిధిలోకి అనుమతించడం లేదని ఆఫీసర్లు హెచ్చరికలు జారీ చేశారు. క్షేత్రపరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్యమత ప్రచారం, అన్యమత కార్యక్రమాలకు సహకరించడం లాంటివి కూడా చట్ట ప్రకారం నేరమే అని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి, విరుద్ధంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా శ్రీశైలం దేవస్థానానికి రెండో ద్వాదశ జ్యోతిర్లింగంగా పిలుస్తారు. దీన్నే అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరో శక్తి పీఠంగా శ్రీశైలం దేవస్థానాన్ని పిలుచుకుంటారు. ఆ మహా శివుడి రూపాల్లో రెండో జ్యోతిర్లింగానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.

అయితే ఇప్పటికే తిరుమల (Tirumala Tirupati Temple) శ్రీవారికి సంబంధించిన ఆలయంలో అన్యమత ప్రచారాలపై నిషేధం విధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బీఆర్ నాయుడు (BR Naidu) బాధ్యతలు చేపట్టాక చాలా మార్పులు చేపట్టారు. లడ్డూ వివాదాన్ని ముగించి.. నాణ్యమైన నెయ్యి వాడాలని ఆదేశాలిచ్చారు. అన్యమత ఉద్యోగస్తులను తొలగించి వారిని వేరే చోటకు తరలించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీ, వీవీఐపీల దర్శనం పై నిబంధనలు కఠినతరం చేశారు.

హిందు ధర్మ పరిరక్షణ కోసం పాటుపడతామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ప్రస్తుతం శ్రీశైల మల్లన్న (Srisailam Mallanna) సన్నిధిలో కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం శ్రీశైలం ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అనేక చోట్ల ఆలయాలపై దాడులు జరిగాయి. ఆలయాల పటిష్టత కోసం అన్యమత ప్రచారాలను నిషేధించడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *