Mana Enadu : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India) ప్రతి నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో 2024లో చివరి నెల డిసెంబరు వచ్చేసింది. మరో వారం అయితే 2024 ఏడాది ముగుస్తుంది. కొత్త సంవత్సరం 2025 ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో 2025 ఏడాదిలో మొదటి నెల అయిన జనవరికి సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది.
జనవరిలో ఏకంగా 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు ఆర్బీఐ (RBI Bank Holidays) తాజా జాబితా ప్రకారం తెలుస్తోంది. దేశంలోని వివిధ బ్యాంకులకు 13 రోజుల పాటు సెలవులు ఉన్నాయని.. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. కస్టమర్లు ఈ హాలిడేస్ ను దృష్టిలో పెట్టుకుని బ్యాంక్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. మరి జనవరిలో బ్యాంకు సెలవులు ఏరోజు ఉన్నాయో ఓ లుక్కేద్దామా..?
2025 జనవరిలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే
- జనవరి 1 (బుధవారం) : న్యూ ఇయర్ సందర్భంగా బ్యాంకులకు సెలవు.
-
జనవరి 2 (గురువారం) : కొత్త సంవత్సరం సందర్భంగా మిజోరంలో; మన్నం జయంతి సందర్భంగా కేరళలోని బ్యాంకులకు హాలిడే.
-
జనవరి 6 (సోమవారం) : గురు గోవింద్ సింగ్ జయంతి పురస్కరించుకుని హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.
-
జనవరి 11 (శనివారం) : మిషనరీ డే రోజున మిజోరంలో; గురు గోవింద్ సింగ్ జయంతి రోజున రాజస్థాన్‌లోని బ్యాంకులకు హాలిడే.
-
జనవరి 12 (ఆదివారం) : ఆదివారం బ్యాంకులు సెలవు.
-
జనవరి 14 (మంగళవారం) : మకర సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ; పొంగల్ సందర్భంగా తమిళనాడులోని బ్యాంకులకు సెలవు.
-
జనవరి 15 (బుధవారం) : మకర సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో హాలిడే ; మాఘ్ బిహు సందర్భంగా అసోంలో, తిరువళ్లువార్ డే సందర్భంగా తమిళనాడులోని బ్యాంకులు పని చేయవు.
-
జనవరి 16 (గురువారం) : కనుమ సందర్భంగా ఏపీలో; ఉజ్ఙవర్ తిరునాళ్ రోజును పురస్కరించుకుని తమిళనాడులోని బ్యాంకులకు హాలిడే.
-
జనవరి 22 (బుధవారం) : ఇమో ఇను ఇరత్ప రోజున మణిపుర్‌లోని బ్యాంకులు పనిచేయవు.
-
జనవరి 23 (గురువారం) : గాన్-నగై సందర్భంగా మణిపుర్‌లో; నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా త్రిపుర, ఒడిశా, పంజాబ్, సిక్కిం, బంగాల్, జమ్ముకశ్మీర్, దిల్లీల్లో హాలిడే.
-
జనవరి 25 (శనివారం) : స్టేట్ డే సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని బ్యాంకులకు హాలిడే.
-
జనవరి 26 (ఆదివారం) : రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు.
-
జనవరి 30 (గురువారం) : సోనమ్ లోసార్ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులు పని చేయవు.






