దాదాపు 20 రోజుల పాటు ఛాంపియన్స్ ట్రోపీ(CT) క్రికెట్ అభిమానులను అలరించింది. రికార్డులు తిరుగరాస్తూ టీమ్ఇండియా మూడోసారి ఈ టైటిల్ దక్కించుకుంది. దీంతో అభిమానులంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే మరో 8 రోజుల్లో క్రీడాభిమానులను అలరించేందుకు మరో మెగా టోర్నీ సిద్ధమవుతోంది. మార్చి 22 నుంచి IPL 18వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమవుతున్నాయి. విదేశీ ప్లేయర్లు ఒక్కొక్కరిగా తమ తమ జట్లతో కలుస్తున్నారు. కాగా తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంప్ KKR vs RCB మధ్య జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మే 25న జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు IPL చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

టాప్ ప్లేస్ కోహ్లీదే
IPL చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో RCB మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. 2008 నుంచి మొత్తం 252 మ్యాచ్‌లు ఆడాడు. కోహ్లీ బ్యాట్ 244 ఇన్నింగ్స్‌లలో 8004 పరుగులు చేసింది. రన్ మెషీన్ సగటు 38, స్ట్రైక్ రేట్ 131. IPLలో కోహ్లీ అత్యధిక స్కోరు 113 పరుగులు (నాటౌట్). ఇప్పటివరకు అతను ఐపీఎల్‌లో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు చేశాడు.

ధవన్ ధనాధన్
SRH మాజీ బ్యాట్స్‌మన్ శిఖర్ ధవన్ IPLలో 5 జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. తన కెరీర్‌లో 2008 నుంచి 2024 వరకు 222 మ్యాచ్‌లు ఆడాడు. ధవన్ 6,769 పరుగులు చేశాడు. IPL చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన 2వ ఆటగాడిగా నిలిచాడు. ధవన్ అత్యధిక స్కోరు 106 నాటౌట్. 2 సార్లు 100 పరుగులు, 51 అర్ధ సెంచరీలు చేశాడు.

రో‘హిట్’ ఇన్నింగ్స్
MI మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2008 నుంచి IPLలో మొత్తం 257 మ్యాచ్‌లు ఆడాడు. హిట్ మ్యాన్ 252 ఇన్నింగ్స్‌లలో 6,628 పరుగులు చేశాడు. IPLలో అత్యధిక పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక స్కోరు 109 నాటౌట్. 2 సెంచరీలు, 43 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.

వార్నర్ అగ్రెషన్
IPL 2024 వరకు DC తరఫున ఆడిన డేవిడ్ వార్నర్‌కు IPL2025 వేలంలో ఎలాంటి బిడ్ ఇవ్వలేదు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన 4వ ఆటగాడిగా డేవిడ్ నిలిచాడు. 2009 నుంచి 2024 వరకు మొత్తం 184 మ్యాచ్‌ల్లో 6,565 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 126 పరుగులు. అతని ఖాతాలో 4 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
రైనా రన్స్
CSK మాజీ క్రికెటర్ సురేష్ రైనా 2008 నుంచి 2021 వరకు IPLలో 205 మ్యాచ్‌లు ఆడి, 200 ఇన్నింగ్స్‌లలో 5,528 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 100 పరుగులు నాటౌట్. IPLలో రైనా 1 సెంచరీ, 39 అర్ధ సెంచరీలు చేశాడు.







