భారత క్రికెట్ నియంత్రణ మండలి(Board of Control for Cricket in India) కొత్త సెక్రటరీ(Secretary) ఎంపికపై బీసీసీఐ దృష్టిసారించింది. ఇంతకుముందు BCCI కార్యదర్శిగా ఉన్న జై షా(Jai Shah) ఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో సెక్రటరీ కోశాధికారి పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ పోస్టుల ఎన్నికలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జై షా వారసుడు ఎవరు? అనే చర్చ మొదలైంది. సెక్రటరీ రేసులో ఢిల్లీ క్రికెట్ సంఘం(DCA) అధ్యక్షుడు రోహన్ జైట్లీ (Rohan Jaitley) అందరికంటే ముందున్నాడని తెలుస్తోంది.
తాత్కాలిక కార్యదర్శిగా సైకియా
కాగా వచ్చే జనవరి 12న సెక్రటరీతోపాటు ట్రెజరర్(Secretary and Treasurer)ను BCCI నియమించనుంది. ఈ పదవి కోసం దేవజిత్ సైకియా, అనిల్ పటేల్, రోహన్ జైట్లీతోపాటు మరికొందరు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అస్సాంకు చెందిన దేవజిత్ సైకియా బోర్డు తాత్కాలిక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, కోశాధికారి స్థానం ఖాళీగా ఉంది. ఈ విషయంలో, ప్రత్యేక సాధారణ సమావేశంలో BCCI ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల అధికారిగా భారత మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ అచల్ కుమార్ జ్యోతి(Achal Kumar Jyoti) నియామకాన్ని ఆమోదించవలసిందిగా అపెక్స్ కౌన్సిల్(Apex Council) కోరింది.
అలా పాపులర్ అయ్యారు..
ఇదిలా ఉండగా ICC ఛైర్మన్‌గా ఎన్నికైన 5వ ఇండియన్‌గా జై షా నిలిచారు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, N శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ICC ఛైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. 2024 డిసెంబర్ 1న ఐసీసీ పదవిని జై షా చేపట్టారు. గ్రెగ్ బార్క్లే(Greg Barclay) స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. 2019లో BCCI కార్యదర్శి(Secretary)గా పదవి చేపట్టాక జై షా పేరు మార్మోగింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా(Union Minister Amit Shah) కుమారుడు కావటంతో మరింత పాపులర్ అయ్యారు. 2019 అక్టోబర్‌లో బీసీసీఐ కార్యదర్శి పదవి చేపట్టారు. 2024లో ఐసీసీ ఛైర్మన్ అయ్యారు. 15ఏళ్ల క్రితం GCAలో సాధారణ సభ్యుడిగా ఉన్న జై షా.. ఇప్పుడు ICC టాప్ పోస్టు స్థాయికి ఎదిగారు.








