సీఎం రేవంత్‌ రెడ్డి భేటీలో చర్చకు వచ్చిన కీలక అంశాలివే..!

తెలుగు చిత్రసీమ (Telugu cinema Industry)కు సంబంధించిన పలు అంశాలు చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డితో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో భాగంగా సినిమా పరిశ్రమకు కూడా ప్రజాప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు.

తెలుగు సినిమా పరిశ్రమకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తోందని సీఎం గుర్తుచేశారు. పరిశ్రమ పురోభివృద్ధికి, ఒక సానుకూల వాతావరణం ఏర్పాటుకు సినీ పరిశ్రమ వైపు నుంచి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఇండస్ట్రీ ప్రముఖులకు సూచించారు.

పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాం. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సినీ రంగానికి హైదరాబాద్ ఒక కేంద్ర బిందువుగా ఉండేలా హాలీవుడ్, బాలీవుడ్ సైతం హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్‌లో పెద్ద సదస్సు నిర్వహించి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నాం. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడిందన్నారు.

ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా , డీజీపీ జితేందర్, సినీ రంగానికి చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు పాల్గొన్నారు.సినీ పరిశ్రమ నుంచి సురేష్ బాబు, కేఎల్ నారాయణ, మురళీమోహన్, కే.రాఘవేందర్ రావు, కొరటాల శివ, వెంకటేశ్, నాగార్జున , అల్లు అరవింద్‌, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోపాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *