
సూసైడ్ (Suicide).. ఈ తరంలో తాత్కాలిక సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారంగా మారింది. పరీక్షల్లో ఫెయిల్ అయినా.. ప్రేమలో విఫలమైనా.. పెళ్లి కాకపోయినా.. తల్లిదండ్రులు తిట్టారని.. టీచర్లు మందలించారని.. ఇలా వివిధ రకాల కారణాలతో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడి బంగారం లాంటి జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది.
పెళ్లి కాలేదని
పెళ్లి కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతకీ సంబంధాలు కుదరడం లేదని బాధ అతడిని వెంటాడటంతో మనస్తాపం చెందాడు. తీవ్ర నిరాశకు లోనైన ఆ యువకుడు తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్ పేట తాలూకా బోయగిరిలో జరిగింది.
తుపాకీతో కాల్చుకుని
దిలీప్ అనే యువకుడు పెళ్లి కాలేదని బాధతో సోమవారం రోజున ఉదయం తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థఆనికంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ అనేది సమస్యలకు పరిష్కారం కాదని అవగాహన కల్పిస్తున్నారు.