వశిష్ట డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’(Vishwambara) చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇందులో చిరుకు జోడీగా త్రిష మరియు ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్రాండ్ విజువల్స్, డివోషనల్ టచ్ కలిగిన కథాంశంతో ఈ సినిమా 2025లో విడుదల కానుందని టాక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు మేకర్స్ కొన్ని సరికొత్త హైలైట్‌లను జోడిస్తున్నారు. అందులో భాగంగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి(MM Keeravaani) సంగీతం అందించగా.. ప్రత్యేక ఐటెం సాంగ్ కోసం మేకర్స్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ (Beems) సిసిరోలియోను రంగంలోకి దింపారు. కధానుగుణంగానే ఈ సినిమాలో ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశారట మేకర్స్. ప్రస్తుతం ఈ పాటకు సంగీతం అందించేందుకు భీమ్స్ పని ప్రారంభించినట్టు సమాచారం.
ఈ ఐటెం సాంగ్‌లో చిరంజీవికి జతగా డాన్స్ చేసే అవకాశం కన్నడ నటి నిశ్వికా నాయుడు(Nishvika Naidu)కి దక్కిందని తెలుస్తోంది. ఆమె నటించిన ‘కరటక దమనక’ సినిమాలో ప్రభుదేవాతో కలిసి చేసిన ‘హితలకా కరిబయడా మావ..’ పాటకు తెలుగులోనూ మంచి క్రేజ్ వచ్చింది. ఆ పాటలో ఆమె ఎనర్జిటిక్ డాన్స్ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు మెగాస్టార్‌తో స్క్రీన్ షేర్ చేయనుందన్న విషయం ఆమె అభిమానులకే కాదు, టాలీవుడ్ వర్గాలకు కూడా ప్రత్యేక ఉత్సాహం కలిగిస్తోంది.






